Dt
19-07-2022
ప్రియమైన మిత్రులారా,
మన అసోసియేషన్  ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వహించే
అరుదైన గౌరవం , అవకాశం ఈసారి  మన ఆంధ్ర సర్కిల్ కి లభించింది
. 03-04-2022 న విజయవాడలో జరిగిన సర్కిల్ కార్యవర్గ సమావేశంలో జాతీయ సమావేశాలు విశాఖపట్నం లో నిర్వహించాలని
నిర్ణయించాం.
09-05-2022
న జరిగిన విశాఖ జిల్లా సర్వసభ్యసమావేశంలో జాతీయ సమావేశాలు నిర్వహించేందుకు సర్వసమ్మతితో సన్నద్హమయ్యారు.
కేంద్ర కార్యవర్గం
05-06-2022 న సమావేశమై డిసెంబర్ 2, 3 తారీఖుల్లో
రెండు రోజుల పాటు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరపాలని నిర్ణయించింది. ఆ వెంటనే జిల్లా నాయకులు ఈసమావేశాల కోసం విశాఖపట్నం , న్యూ రైల్వే కాలనీ లోని సుబ్బలక్ష్మి కల్యాణ మండపం (వేదిక)
బుక్ చేశారు. 
65000
జీవితకాల సభ్యులు మరియు 32000 వార్షిక సభ్యులతో
AIBSNLPWA భారతదేశంలోనే 
టెలికాం పెన్షనర్ల అతిపెద్ద సంస్థ. 10000 మంది సభ్యులతో అసోసియేషన్ మన ఆంధ్ర సర్కిల్  రెండవ అతిపెద్ద సర్కిల్. కేంద్ర నాయకత్వం అందించిన అరుదైన గౌరవం గత నాలుగేళ్లలో మన  అద్భుతమైన సంస్థ పనితీరుకు నిజమైన
ప్రతిబింబం. ఇది ఒక 
గొప్ప బాధ్యత. సవాల్గా స్వీకరిద్దాం .
AICలో 22 సర్కిల్ల నుండి
1350 మంది ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నాం . సందర్శకులను అనుమతించబోమని CHQ ప్రకటించినప్పటికీ వారిలో
కొందరు వారి జీవిత భాగస్వాములతో కూడా రావొచ్చు.  CWC సభ్యులతో కలిపి పాల్గొనే
వారి సంఖ్య 1500 వరకు ఉండొచ్చును .   మరొక 500  మంది మన  సర్కిల్ కామ్రేడ్లు ఉంటారు, ఎందుకంటే మనం  డిసెంబర్ 4న
వైజాగ్లోనే మన 
సర్కిల్ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తాము.
సంక్షిప్తంగా, ఇది భారతదేశంలోని BSNL పెన్షనర్స్ 2000 మంది నాయకుల గొప్ప, చారిత్రాత్మక సభ.  BSNL పెన్షనర్ల భవితవ్యాన్ని నిర్ణయించే కార్యక్రమం ‘ సిటీ
ఆఫ్ డెస్టినీ’ లో జరుగుతుంది.
వైవిధ్యమైన సంస్కృతి,
విభిన్న ఆహారపు అలవాట్లు, గొప్ప అంచనాలతో దేశం
నలుమూలలనుండి ప్రతినిధులు  ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు అందించబోయే  అద్భుతమైన గొప్ప ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు
వైజాగ్కు వస్తున్నారు.
సర్వశ్రీ  M శ్రీమన్నారాయణ, K సోమ సుందరరావు, P బాబు రావు, SVSN మూర్తి, S రామ్ ప్రసాద్, M వెంకటేశ్వర్లు,
VRK శర్మ, MR పట్నాయక్, A శ్రీరామరావు, T S సుకుమారన్, D కనక సుందర్, T రాజేశ్వర్లతో కూడిన
ప్రత్యేక బృందం , పి వి పార్థ సారథి, పి
వి రామశర్మ, కె . సోమేశ్వరరావు,
కె.వి.డి స్వామి,
పి సి నాయుడు, డి రమేష్ బాబు తదితరులు ఇప్పటికే
ఈ పనిని నెరవేర్చడానికి రంగంలోకి దిగారు. మన  AICని ఒక గొప్ప ప్రత్యేకమైన ఈవెంట్గా మార్చాలనే లక్ష్యంతో బృందం ఉంది. జట్టుగా చేసే కృషి
ఏ కలనైనా సాధించగలదు. మనం  చేస్తాం, కచ్చితంగా
సాధిస్తాం.
నాలుగు రోజుల పాటు
2000 మందికి వసతి, భోజనం ఏర్పాటు చేయాలి.
కనిష్టంగా దాదాపు ₹ 60 లక్షల ఖర్చు అవుతుంది.
CHQ ద్వారా 'AIC ఫండ్'  రూపేణా ఇతర సర్కిల్ల నుండి ₹ 25 లక్షలు   ఆశిస్తున్నాము. డెలిగేట్ ఫీజుగా ₹ 10 లక్షలు కూడా ఆశిస్తున్నాం.
ఇప్పటికింకా,  ఆంధ్రా స్నేహితులందరం కలిసి ₹ 25 లక్షలు  సేకరించాల్సి ఉంది . మనం మొత్తం సర్కిల్లోని ప్రతి ఒక్క సభ్యుడిని కలుసు
కోలేము. విశాఖపట్నం (హోస్ట్ బ్రాంచ్), విజయనగరం నుండి కామ్రేడ్లు ఇప్పటికే ఈ సభల  కోసం మంచి మొత్తాలను విరాళంగా ఇచ్చేందుకు
ముందుకు వచ్చారు. ఇది చాలా ఉత్సాహం కలిగించేదే.  మన సభ్యులందరినీ ఉదారంగా విరాళం ఇవ్వవలసిందిగా  విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ తలా కనీసం ₹ 1000 విరాళం అందిస్తే, ఈ కార్యక్రమాన్ని మన  అసోసియేషన్ చరిత్రలో ఒక మైలురాయిగా మార్చగలము.
‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ ’ అంటారు.
“ చివరి ముద్ర శాశ్వత ముద్ర” అన్నది కూడా నిజం.
గొప్ప వారసత్వం కలిగిన ఆంధ్రుల ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు ప్రతినిధులు
సంతోషించాలి. ఆ ఆతిథ్యపు శాశ్వతమైన ముద్రతో వారు తిరిగి
వెళ్ళాలి. అందుకోసం ఆంధ్రా సర్కిల్లోని
దాదాపు 500 మంది 
కామ్రేడ్లు  క్రమశిక్షణ మరియు అంకితభావంతో ఒక
మిలటరీ బ్రిగేడ్గా, 
టీమ్గా పనిచేయాలి. సీనియర్ సిటిజన్స్ కావడం వల్ల నాలుగు రోజులు పని చేయడం అందరికీ కష్టమే.
అందువల్ల మొత్తం వాలంటీర్లను రెండు గ్రూపులుగా  ఏర్పాటు చేసుకోవాలి .
మిత్రులారా
,
కాన్ఫరెన్స్ ఫండ్కు ₹ 10000 కంటే ఎక్కువ విరాళం ఇవ్వగల సహచరులను ముందుగా
తమ సుముఖతను తెలియజేయవలసిందిగా  అభ్యర్థిస్తున్నాను. ‘రిసెప్షన్ కమిటీ, ఆల్ ఇండియా కాన్ఫరెన్స్, AIBSNLPWA, విశాఖపట్నం’
పేరిట ‘ఇండియన్ బ్యాంక్’ (బ్రాంచ్: దాబా గార్డెన్స్)లో ప్రత్యేక
ఖాతా తెరవబడింది. AIC ఫండ్ , విరాళాలను
పేరు, స్టేషన్, ఖాతా నంబర్ మొదలైన వివరాలతో
నేరుగా ఈ ఖాతాకు పంపవచ్చు.
జిల్లా యూనిట్లు మరియు సర్కిల్లోని శాఖల నాయకులందరినీ బయటకు వెళ్లి, ప్రతి సభ్యుడిని
వ్యక్తిగతంగా సంప్రదించి, వారి విరాళాలు సేకరించి, రిసెప్షన్ కమిటీకి పంపవలసిందిగా 
అభ్యర్థిస్తున్నాను. అందరు కలిసి సమష్టిగా  క్రమపద్ధతిలో పని చేస్తే ఇది పెద్ద
కష్టం కాదు.
BSNL
పెన్షనర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు , పింఛను
సవరణ అత్యంత ముఖ్యమైనది. మనం ఎన్నో అడ్డంకులు దాటాలి.  మనం యీ  రేసును పూర్తి చేస్తాము. మన  లక్ష్యాన్ని
చేరుకుంటాము.  గెలుపే
లక్ష్యం.  విజయం కంటే
తక్కువైన  దేనితోనూ సంతృప్తి
చెందము.  వైజాగ్
AIC మనమందరం  కలుసుకోవడానికి, చర్చించడానికి భారతదేశంలోని
BSNL పెన్షనర్ల భవిష్యత్తును  నిర్ణయించడానికి మనకొక అవకాశాన్ని
అందిస్తుంది.
ఆ సదవకాశాన్ని ఆంధ్రా సర్కిల్ సహచరులమైన మనమే
ఇస్తున్నాం .
శుభాకాంక్షలతో