కామ్రేడ్స్ పి.ఎస్.రామన్ కుట్టి, డి.గోపాలకృష్ణన్, ఆర్.ఎన్.పడనాయర్ (మాజీ సర్కిల్ కార్యదర్శి,కేరళ), టి.పి.జార్జ్ (సర్కిల్ కార్యదర్శి,కేరళ) కేరళలోని కొచ్చిలో అడ్వకేట్ శ్రీరాజ్ ను 23-01-2018 న కలిసి
యీ రెండు సమస్యల గురించి చర్చించారు.
(1) 10-6-2013 కు బదులుగా
01-01-2007 నుండి 78.2% తో పింఛను బకాయిలను పొందటానికి.
(2)CCS పెన్షన్ రూల్స్, 1972
లో కవర్ చేయబడిన మనకు కూడా ఇతర కేంద్ర
ప్రభుత్వ పెన్షనర్లతో సమానంగా BSNL పెన్షనర్లు కూడా
చివరి జీతంలో 50% మొత్తాన్ని పెన్షన్ గా
పొందటానికి .
ఫై రెండు కేసుల గురించి మన నాయకులు
ఒక గంటకు ఫైగా అడ్వకేట్ తో చర్చించారు.
అడ్వకేట్ శ్రిరాజ్ extra ఇంక్రిమెంట్ కేసు ను వాదించి గెలిపించారు. CAT, ఎర్నాకుళం లో రెండు
కేసులను దాఖలు చేయడానికి శ్రిరాజ్ అంగీకరించారు. అన్ని సంబంధిత
డాక్యుమెంట్లను వారికి అప్పగించాము. పత్రాలను పూర్తిగా చదివిన తర్వాత అడ్వకేట్
రెండు వారాల వ్యవధిలో పిటిషన్లను దాఖలు చేయడానికి అన్ని చర్యలను తీసుకుంటారు.
కామ్రేడ్ పి.ఎస్.రామన్ కుట్టి కేరళలో మరో ఇద్దరు,ముగ్గురు
పెన్షనర్లను కలుపుకొని AIBSNLPWA
తరఫున పిటిషను దాఖలు
చేస్తారు. కేరళ లోని పెన్షనర్ల జాబితాను లబ్ధిదారులుగా చూపించి యీ
పిటిషను కు జత చేస్తారు. ఎర్నాకుళం కేట్ పరిధి కేరళ
రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనoదున, ఇతర రాష్ట్రాల జాబితాను ఈ దశలో జత చేయటo లేదు. టెలికాం శాఖ ట్రిబ్యునల్లో ఓడినప్పుడల్లా
హై కోర్టులో , సుప్రీమ్ కోర్టులో అప్పీల్
చేస్తోంది. పెన్షన్ అనమలీ కేసు ట్రిబ్యునల్లో గెలిచినా
టెలికాం శాఖ అమలు చేయని
పరిస్థితి మనకు అనుభవమయిoది. ఈ కేసుల్లో కూడా అలాగే జరిగే అవకాశం ఉంటుందని అoచనా వేయొచ్చు. సుప్రీం కోర్టుకు కెళ్ళినప్పుడు,
ఇతర సర్కిల్స్ కు చెందిన పెన్షనర్ల జాబితాలను జతచేయవచ్చు. సాoకేతిక కారణంగా అప్లికేషను తిరస్కరణకు గురికాకుండా జాగ్రత్త వహించవలసివుoది. చట్టబద్దమైన పోరాటం చాలా జాగ్రత్తగా పోరాడాలి. ఇది దీర్ఘకాలిక పోరాటం కూడా.
అనామలి కేసు
అసోసియేషన్ గెలిచిన కేసులో పిటిషనర్లకు అనుకూలంగా ఇచ్చిన CAT ప్రిన్సిపల్ బెంచ్
తీర్పుకు వ్యతిరేకంగా టెలికాం విభాగం దాఖలు చేసిన అప్పీల్
పిటిషన్ ను ఢిల్లీ
హైకోర్టు చేపట్టింది. స్వల్పకాలం పాటు వాదనలు విన్నతర్వాత, హైకోర్టు,
యీ కేసును 22-10-2018 తేదీకి వాయిదా వేసింది.
తొమ్మిది నెలల గ్యాప్ !!!!. మన అడ్వకేట్ దగ్గరలో తేదీని నిర్ణయించాలని వేడుకున్నప్పటికీ హైకోర్టు
అంగీకరించలేదు.