16 Jul 2018

ధర్నా 18-07-2018

డియర్ కామ్రేడ్సు, 

చెన్నై కార్యవర్గ సమావేశాల నిర్ణాయానుసారం 7వ వేతన సంఘ సిఫార్సులననుసరించి బి.ఎస్.ఎన్.ఎల్ పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ జరపాలనీ కోరుతూ రెండవ విడత ఆందోళనగా  18-07-2018 న దేశవ్యాప్తంగా ఒక రోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న సభ్యులకు , నాయకులకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అభినందనలు తెలియ చేస్తోంది.

గతనెల 20 వ తారీఖున  నిరసన ప్రదర్శన విజయవంతంగా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే.  

ఈనెల ఆరవ తారీఖున మన జనరల్ సెక్రటరీ కామ్రేడ్ నటరాజన్ న్యూ ఢిల్లీ లో డి.ఓ.టి. డైరెక్టర్ (ఎస్టాబ్లిష్ మెంట్) ను కలిసినప్పుడు , ఆయన దేశంలోని అనేక బ్రాంచీల నుండి పెన్షన్ రివిజన్ కోరుతూ  మనం పంపిన తీర్మానాలు అందినట్లు తెలియజేశారు. 

7వ వేతన సంఘ సిఫార్సు ప్రకారం 32% ఫిట్ మెంట్ తో పెన్షన్ సవరణ చేయాలన్న మన డిమాండ్ ను పెన్షన్ & పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు పంపుతున్నట్లు తెలిసింది. 

బి.ఎస్.ఎన్.ఎల్. ఉద్యోగులకు పే రివిజన్ కి సంబంధించిన  కేబినెట్ నోట్ ఇంకా డి.ఓ.టి లోనే ఉంది. 

డి.ఓ.టి సమాచారం ప్రకారం పే రివిజన్ ప్రభుత్వ ఆమోదం పొందిన తరువాత మాత్రమే  పెన్షన్ రివిజన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అంటున్నారు. గతంలో కూడా ఇలాగే పేరివిజన్ తరువాత మాత్రమే పెన్షన్ రివిజన్ జరిగిందనీ డి.ఓ.టీ అంటోంది. దీని బట్టి పేరివిజన్ , పెన్షన్ రివిజన్ ఒకదానితో ఒకటి లింక్ లేకుండా జరపటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదనేది మనకు అర్థం అవుతోంది. 

అంటే రెండవ పి.ఆర్.సి సమయంలో జరిగిన ఆలస్యం ఈసారి కూడా తప్పదా? ఈ అనవసరం జాప్యం వలన  పెన్షనర్లకు అన్యాయం జరుగుతోంది. 

ఇతర యూనియన్లు, అసోసియేషన్లు 3వ పి.ఆర్.సి. ప్రకారం వేతన సవరణ, పెన్షన్ సవరణ రెండూ జరగాలనీ అంటున్నాయి. ఈరకంగా ఒకదానితో మరొకటి ముడి పెట్టడం వల్ల మన ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం వుంది. దీన్ని అర్థం చేసుకుని    అన్ని సంఘాలు  ఐక్యం గా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది.

డి.ఓ.టి పే రివిజన్ కోసం ఫిట్ మెంట్ బెనిఫిట్ ఎంత శాతం సిఫార్సు చేస్తుందో తెలియదు. తుది ఫలితం అనిశ్చితం.  

60:40 నిబంధన రధ్ధైనందున, కేంద్రప్రభుత్వమే బి.ఎస్.ఎన్.ఎల్ రిటైరీలకు పెన్షన్ చెల్లిస్తున్నందున కంపెనీ లాభనష్టాలతో సంబంధం లేకుండా పెన్షన్  రివిజన్ జరగవలసి ఉందన్న విషయం అందరూ గమనించాలి. 

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మన అసోసియేషన్ మొదటి నుండీ 7వ వేతన సంఘ సిఫార్సు చేసిన 32 % బేసిక్ పెన్షన్ పై ప్రయోజనంతో కూడిన రివిజన్ డిమాండ్ చేస్తున్నది.  మరియు రివిజన్ 01-01-2017 నుండి జరగాలని , ముఖ్యం గా IDA నే కొనసాగించాలని కోరుతున్నాం‌ . వేరే యూనియన్ /  అసోసియేషన్ చేస్తున్న విమర్శలు నిజం కావని గమనించగలరు. 

ఈ పరిస్థితుల్లో పెన్షన్ రివిజన్ సాధించడం అంత సులభం కాదని గ్రహించాలి.  తుది వరకు ఆందోళన చేయక తప్పదు. మన ఈ ఆందోళన అవసరమైన మేరకు మరింత ఉధృతం చేయటానికి సంసిద్ధంగా       వుందాం. గతంలో మనం సాధించిన విజయాల స్పూర్తితో విశ్వాసం తో ముందుకు సాగుదాం. 

ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధాన మంత్రి గారికి మరియు కేంద్ర సిబ్బంది & పెన్షన్ శాఖల మంత్రి    గారికి పెన్షన్ రివిజన్ కోరుతూ తీర్మానాలు చేసి పంపుతున్నాం. 

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనా కార్యక్రమంలో  మన రాష్ట్రంలో కూడా ఎప్పటి లాగానే ఇప్పుడు కూడా  మన సభ్యులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ,