21 Nov 2018

Hunger fast 22-11-2018


డియర్ కామ్రేడ్స్,
పూరీ జాతీయ సమావేశాల నిర్ణయానుసారం 7 వేతన సంఘ సిఫార్సులననుసరించి బి.ఎస్.ఎన్.ఎల్ పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ జరపాలనీ కోరుతూ 22-11-2018 ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా బి.ఎస్.ఎన్.ఎల్ ఆఫీసు లముందు ఒక రోజు నిరాహారదీక్ష చేయాలని ఆలిండియా బి.ఎస్.ఎన్.ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర సంఘం పిలుపు నిచ్చింది.  మన కార్యక్రమానికి యంటియన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రిటైర్డ్ టెలికాం ఆఫీసర్స్ అసోసియేషన్, ఆలిండియా రిటైర్డ్ బి.ఎస్.ఎన్.ఎల్  ఎక్సిక్యూటివ్స్  వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతు తెలిపాయి. సంయుక్తంగా నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
కార్యక్రమం లో పాల్గొంటున్నఅన్ని జిల్లాల్లోని  సభ్యులకు , నాయకులకు ఆంద్రప్రదేశ్ సర్కిల్ అభినందనలు తెలియచేస్తోంది.
యిదే డిమాండ్ పై 19-07-2018 దేశవ్యాపిత ధర్నా  విజయవంతంగా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే.
60:40 నిబంధన రధ్ధైనందున, కేంద్రప్రభుత్వమే బి.ఎస్.ఎన్.ఎల్ రిటైరీలకు పెన్షన్ చెల్లిస్తున్నందున కంపెనీ లాభనష్టాలతో సంబంధం లేకుండా పెన్షన్  రివిజన్ జరగవలసి ఉంది. ప్రస్తుత బేసిక్ పెన్షన్ ప్లస్ 01-01-2017 నాటి IDA మరియు బేసిక్ పెన్షన్ ఫై 32% వెయిటేజీ కలుపుతూ 7 వేతన సంఘ సిఫార్సుల ప్రకారం పెన్షన్ సవరణ 01-01-2017 నుండి జరుపాలని కోరుతున్నాo.
గత పెన్షన్ సవరణ 01-01-2007 నుండి అమలయింది కావున 10 సంవత్సరాల తర్వాత 01-01-2017 నుండి జరుగవలసివుంది. యివే సిఫార్సులననుసరించి 62 లక్షల మంది కేంద్రప్రభుత్వ పెన్షనర్లకు పెరుగుదల ప్రయోజనంతో సవరణ జరిగి దాదాపు 2 సంవత్సరాలయింది. యీ అంశoఫై అనేక సార్లు వ్రాతపూర్వకంగా కోరటం జరిగింది. గౌరవ కేంద్రామంత్రి గారితోనూ మరియు టెలికాం కార్యదర్శిగారితోనూ యీ డిమాండ్ ఫై చర్చించి యిప్పటికే పది నెలలు గడిచిపోయాయి.  
3 పి.ఆర్.సి. ప్రకారం వేతన సవరణ, పెన్షన్ సవరణ ఒకదానితో మరొకటి ముడి పెట్టడం వల్ల తీవ్ర  జాప్యం జరుగుతున్నందున,  వేతన సవరణ జరిగే వరకు పెన్షన్ సవరణ నిలిపి వేయకుండా వెంటనే చేయాలని యీ దీక్షా కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనా కార్యక్రమంలో మన రాష్ట్రంలో కూడా ఎప్పటి లాగానే ఇప్పుడు కూడా మన సభ్యులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ,

అభినందనలతో
సర్కిల్ కార్యదర్శి