ప్రియమైన
కామ్రేడ్స్,
ఎడతెరిపి
లేని వర్షాలకు దేశమంతా తడిసిముద్దయింది. వాన వరదై పలు రాష్ట్రాలను వణికించింది.
దక్షిణ, పశ్చిమ భారతంలో నీటి ఉద్ధృతితో జనజీవనం అతలాకుతలమయింది. ఆంధ్ర, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గడ్,
డిల్లీ, గుజరాత్, హర్యానా,
హిమాచల్, జమ్మూ, కర్ణాటక,
కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,
పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు,
తెలంగాణ, యుపి, ఉత్తరాఖండ్ లలో వరదలకు
ఇప్పటివరకు అనేక మంది మృత్యువాతపడ్డారు.
ఎగువన
వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో.. లంక గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ముంపు వీడక
ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు.
ఇది చాలా
అసాధారణ పరిస్థితి. అపార నష్టాన్ని మిగిల్చింది.
వేల కోట్ల
ఆస్తి నష్టం, పంట నష్టం, ప్రజల జీవితకాల పొదుపులు
మొత్తంగా భారీ నష్టం జరిగింది. వీటిలో
కొన్ని తిరిగి పొందలేము.
సంక్షేమ
సంఘంగా మనం గతంలో ఆంధ్ర, చార్ ధామ్, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, తమిళనాడు
మొదలైన ప్రాంతాలలో వరదలు / తుఫానుల సమయంలోకూడా మన వంతు సాయం చేసాము. అలాగే
మరొకసారి సహాయం చేయాల్సిన సమయమిది.
మన కేంద్ర
సంఘం విరాళాల రూపంలో సాయపడాలని పిలుపిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈసారి దాదాపు 20 రాష్ట్రాలు యీనష్టానికి
గురయినందువల్ల ఏ ఒక్క రాష్ట్రానికీ పరిమితం చేయకుండా , ప్రధానమంత్రి జాతీయ ఉపశమన
నిధికి (పిఎంఎన్ఆర్ఎఫ్) , దాని కోసం చేయబోయే ఒక కార్యక్రమంలో కేంద్రమంత్రి
ద్వారా అందజేయాలని మన జాతీయ నాయకత్వం
నిర్ణయించింది. అందువల్ల మనం ఇవ్వ బోయే సహాయం సాద్యమయినంత భారీగా ఉంటే గౌరవప్రదంగా
వుంటుందనీ, మన సంఘానికి మరింత గుర్తింపు లభిస్తుందని ఆశించవచ్చు.
2019
సెప్టెంబర్ నెలను పిఎంఎన్ఆర్ఎఫ్ డొనేషన్ డ్రైవ్ నెలగా ప్రకటించటమయింది.
ఈనెలాఖరులోగా ఈ కార్యక్రమం పూర్తిచేయాలని కోరుతున్నాం. జిల్లాలో సభ్యత్వం ప్రకారం ప్రతి
ఒక సభ్యుడికి సగటున 100 రూపాయల చొప్పున వసూలు
చేయాలని నిర్దేశించుకుంటే ఆశంచిన మేరకు సేకరణ అసాధ్యం కాకపోవచ్చు.
మన జిల్లా
కార్యదర్శిలు,సర్కిల్ కార్యవర్గసభ్యులు తగు విధంగా కార్యాచరణకు వెంటనే పూనుకోవాలని
కోరుతున్నాను. ఎప్పటిలాగానే మన సర్కిల్ ఈసారి కూడా లక్ష్యసాధనలో ముందుంటుందని
ఆశిస్తూ ..... శుభాకాంక్షలతో
వి.వరప్రసాద్
సర్కిల్
కార్యదర్శి