డియర్ కామ్రేడ్సు
మన జనరల్ శెక్రటరి కామ్రేడ్ గంగాధర రావు
గారి పిలుపు మేరకు కోవిడ్ 19 విరాళాలు మన రాష్ట్రము నుండి 1058 మంది
సభ్యులు రూ 13,68,702 లను పి.ఎమ్ కేర్సు / సి.ఎమ్ సహాయ నిధులకు పంపించారు. ఆ  సభ్యులకు, ప్రోత్సహించిన జిల్లా/సర్కిల్ నాయకులకు సర్కిల్ అసోసియేషన్
తరఫున ధన్యవాదములు తెలియచేస్తున్నాము.
మన సర్కిల్ లో గుంటూరు, విజయనగరం ,పశ్చిమ గోదావరి జిల్లాలు వరుసగా ఎక్కువ మొత్తంలో విరాళాలు పంపిన మొదటి మూడు స్థానాలలో వున్నాయి. ఈ జిల్లాల కార్యదర్శు లకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఒక కోటి నాలుగు లక్షల  రూపాయలను  పి.ఎమ్ కేర్సు / ఆయా రాష్ట్రాల సి.ఎమ్ సహాయ
నిధులకు పంపించినటువంటి బృహత్ కార్యక్రమాన్ని యిచ్చి,  విజయవంతంగా నిర్వహించిన కేంద్ర నాయకత్వానికి  మన సర్కిల్ అసోసియేషన్ తరుపున ధన్యవాదములు తెలియచేస్తున్నాము.
 తమిళనాడు ,కర్నాటక ,కేరళ రాష్ట్రముల
తరువాత మన రాష్ట్రము నుండి ఎక్కువ మొత్తం పంపండం జరిగింది. 
మన సర్కిల్ నుండి పదివేలు అంతకుమించి పంపిన
వారు : 
శ్రీ వై.అనంతం   (విశాఖ)                        ₹ 103001
శ్రీ ఎ.నాగేంద్రరావు (పశ్చిమ గోదావరి)       ₹ 30000
శ్రీ ఎమ్.మల్లిఖార్జునరావు (విశాఖ)            ₹ 20001
శ్రీ ఎమ్.చిన్నారావు  (పశ్చిమ గోదావరి)   ₹ 10116
శ్రీ ఎ.సి.కె.నాయుడు (నెల్లూరు)                ₹ 10000
శ్రీ గోరంట్ల రమణ (కర్నూలు)                   ₹ 10000
శ్రీ పి.రంగరాజు  (పశ్చిమ గోదావరి)            ₹ 10000
రక రకాల ప్రతికూల పరిస్తితులున్నప్పటికీ
వాటన్నింటినీ అధిగమించి  కరోనా మహమ్మారి విపత్తు
నివారణ (కేంద్ర, రాష్టాల) సహాయనిధికి మన వంతు సహాయం అందించిన సభ్యులందరికీ
హృదయపూర్వక కృతజ్ణతలు. మనకు సంబంధించిన సమస్యల పట్లే కాకుండా సామాజిక బాధ్యతల పట్ల
కూడా  మన అసోసియేషన్ కేంద్ర సంఘం
నాయకత్వంలో మన సభ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని మరొకసారి రుజువు చేసిన వారందరకీ
కృతజ్ణతాభినందనలు. 
వి.వర ప్రసాద్  సి.ఎస్