18 Aug 2021

CHQ Greets on Formation Day

 ప‌న్నెండు ఏళ్ళుగా .......  ఏఐ బిఎస్ఎన్ఎల్ పిడ‌బ్ల్యూఎ

(20, ఆగ‌స్టు 2009 - 20, ఆగ‌స్టు 2021)

డియ‌ర్ కామ్రేడ్స్

మ‌న ఆలిండియా  బిఎస్ఎన్ఎల్ పిడ‌బ్ల్యూఎ సంస్థ 12వ వ వార్షికోత్స‌వ శుభ సంద‌ర్భంలో మీ అంద‌రికీ  అభినంద‌న‌లు. గ‌త ప‌న్నెండేళ్ళుగా  మ‌నం పెరుగుతూ... ఈ రోజు భార‌త దేశంలోనే అతి పెద్ద టెలికాం పెన్ష‌న‌ర్స్ ఆర్గ‌నైజేష‌న్ గా ఎదిగాం. దేశ‌వ్యాప్తంగా 23 స‌ర్కిళ్ళు, 250 టెలికాం జిల్లాల‌లో మ‌న సంస్థ విస్త‌రించింది.  

ఈ సుదీర్ఘ కాలంలో మ‌నం ఎన్నోఅవాంతారాల‌ను ఎదుర్కొన్నాం. పెన్ష‌న్ రివిజ‌న్-2007, 60:40 నిబంధన రద్దు వంటి ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకున్నాం. యింకా సాధించుకోవలసినవీ వున్నాయి.. ఏదీ మ‌న‌కు ద‌య‌తో రాలేదు... అన్నీ మ‌నం పోరాటాల‌తోనే సాధించుకున్నాం. ఈ ఐక‌మ‌త్య‌మే మ‌న బ‌లం, అంకిత‌భావ‌మే మ‌న పెట్టుబ‌డి. 

ఈ శుభ స‌మ‌యంలో మ‌నంమ‌న ల‌క్ష్య సాధ‌న‌కు అకుంఠిత దీక్ష‌, సంక‌ల్పంతో పురోగ‌మించేందుకు ప్ర‌తిజ్ణ్న‌పూనుదాం.  మ‌నం ప‌య‌నించే బాట‌లో ఎన్నో అడ్డంకులుంటాయి, కానీ ఏవీ మ‌న‌ను నిరోధించ లేవు. మ‌న ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌లేవు. మ‌న‌వాళి చ‌రిత్ర‌లో అనూహ్య‌మైన సంక్షోభాన్ని ఇపుడు ప్ర‌పంచం అంతా ఎదుర్కొంటోంది. ఓ సూక్ష్మ వైర‌స్ ప్ర‌పంచ గ‌తిని మార్చేసింది. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది. ప్రతీ సృజనాత్మ‌క కార్య‌కలాపం  స్తంభించిపోయింది. అనేక దేశాల ఆర్దిక వ్య‌వ‌స్థ బాగా దెబ్బ‌తింది. ప్ర‌పంచ యుద్ధాలు కూడా చేయ‌లేని విధ్వంసాన్నిఒక వైర‌స్ చేసేసింది. దీని వ‌ల్ల 15 నెల‌ల పాటు మ‌నం భైతికంగా  క‌ల‌వ‌లేక‌పోయాం. కేవలం వ‌ర్చువ‌ల్ మీటింగ్ లు మాత్ర‌మే ఇపుడు చాలా చో్ట్లా పెట్టుకోగ‌లం. అదే చేయాలి కూడా. ఇలాంటి అసామాన్య ప‌రిస్థితుల్లో మ‌నం టెక్నాల‌జీని వినియోగించుకోవాలి. 

ఆగ‌స్టు 20న మ‌న జిల్లా సంఘాలు భౌతికంగా స‌మావేశమై , 12 వ వార్షికోత్స‌వ‌ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుకోవాలి. భౌతికంగా క‌ల‌వ‌లేని ఇత‌ర ప్రాంతాల వారు ఆన్ లైన్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై స‌మీక్షించాలి. మ‌న ఇ-జ‌ర్న‌ల్ ద్వారా అంద‌జేసిన అంశాలు, మ‌న డిమాండ్ల‌పై చ‌ర్చించాలి. 

మ‌న సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ గోపాల కృష్ణ‌న్ ఇచ్చిన 25 వాయిస్ మెసేజ్ ల‌ను మీమీ వాట్స్ అప్ గ్రూపుల‌కు పంపుతున్నాం. జిల్లా సెక్ర‌ట‌రీలు కూడా వారి వాట్స్ అప్ గ్రూపులు, యిప్పటివరకు లేనట్లయితే, ఏర్పాటు చేసుకోవాలి. ప్ర‌స్తుతం ఇదే మ‌న‌కు సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌సార సాధ‌నం. CHQ అన్నిఅంశాల‌పై లేటెస్ట్ స‌మాచారాన్ని, CHQ ద్వారా ఏర్పాటైన వాట్స్ అప్ గ్రూపులలో పోస్ట్ చేస్తోంది. అలాగే సర్కిల్ /జిల్లా కార్యదర్శులు కూడా వారి ద్వారా ఏర్పాటైన వాట్స్ అప్ గ్రూపులలో ఆరకంగా పంపినట్లైతే మ‌నం 30 వేల మంది స‌భ్యుల‌కు ఆ  స‌మాచారాన్ని తక్షణం పంపగలుగుతాం.. 

ఈ కష్ట కాలం పోయి... మ‌నం అంతా క‌లిసి CWC,  AIC స్థాయిలో త్వ‌ర‌లో స‌మావేశం కాగ‌ల‌మ‌ని ఆశిస్తూ...  

అభినంద‌న‌ల‌తో

పి.గంగాధ‌ర రావు



                                విజ‌య వేదిక‌ను అధిరోహిద్దాం...రండి కామ్రేడ్స్!

                            మ‌న ఏఐ బిఎస్ఎన్ఎల్ పిడ‌బ్ల్యూఎ 12 వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా, సంస్థ జాతీయ అధ్య‌క్షుడిగా స‌గ‌ర్వంగా మీకీ సందేశాన్ని అందిస్తున్నాను.

బి.ఎస్.ఎన్.ఎల్. రిటైరీల ఐక్య ఆలోచ‌న‌ల ఆధారంగా మ‌నం ఈ సంస్థ‌ను 2009 లో ఏర్పాటు చేసుక‌న్నాం.  ఆరోజు మ‌నం వేసిన బీజం భూమిలో మొల‌కెత్తి, నేడు వేళ్ళూనుకుని వెలుగు చూసింది. నాడు ఆగ‌స్టు 20, 2009లో మ‌న స‌భ్యత్వం సున్న‌. ఈనాడు అది అర‌వై వేల‌కు పైమాటే. ఈ ఎదుగుద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం, కింది స్థాయిలో నాయ‌క‌త్వ ప‌ఠిమ‌, బ్రాంచుల స్థాయిలో స‌త్ సంక‌ల్పం క‌లిగిన నాయ‌కులుండ‌ట‌మే. 

ఇపుడు లాక్ డౌన్ ప‌రిస్థితుల‌లో మ‌నం భౌతికంగా స‌మావేశం కాలేక‌పోవ‌డం వ‌ల్ల‌, స‌భ్య‌త్వాలను స‌మీక‌రించ‌డం సాధ్యం కావ‌డం లేదు. లేకుంటే, ఈపాటికి మ‌న సంఘం లైఫ్ మెంబ‌ర్ షిప్ ల‌క్ష దాటిపోయేది. కింది స్థాయి నాయ‌క‌త్వం స‌మ‌ర్ధంగా ప‌నిచేయ‌డంతో మ‌న స‌భ్య‌త్వం పెరుగుద‌ల సాధ్యం అవుతోంది. ముఖ్యంగా త‌మిళ‌నాడు, చెన్న‌య్ టిడి, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణా, క‌ర్ణాట‌క స‌ర్కిళ్ళ‌లో గణనీయ పెరుగుదల ప్రశంసనీయం. 

గ‌ట్టి పునాది ఉంటేనే ధృఢ‌మైన ఇంటిని నిర్మించ‌గ‌లం. మ‌న ఐక్య‌త‌, అంకిత‌భావం, సంక‌ల్ప‌మే సంఘానికి పునాది. మ‌న‌కు ఎదుర‌యిన ప్ర‌తి స‌వాలును ఒక అవ‌కాశంగా మలుచుకున్నాం. పన్నెండేళ్ళ‌ స్వల్ప వ్యవధిలోనే మ‌నం టెలికాంలో నెంబ‌ర్ వ‌న్ సంస్థ‌గా ఎదిగాం.

ఒలింపిక్ మైదానంలో గోల్డ్ మెడ‌ల్ కోసం పోడియంపైకి ఎక్కాల‌ని ప్ర‌తి అధ్లెట్ త‌హ‌త‌హ‌లాడ‌తాడు. అలాగే, మ‌నం అలాంటి క‌ల‌తోనే మ‌న ప్ర‌యాణాన్ని ఆరంభించి, ధృఢ సంక‌ల్పంతో అధ్భుత స్థానాన్ని సాధించ‌గ‌లిగాం. 

ఆగ‌స్టు 2009కి మునుపే కేంద్ర స‌ర్వీసుల్లో  పే రివిజ‌న్, పెన్ష‌న్ రివిజ‌న్ జరిగింది. బిఎస్ఎన్ఎల్ లో పే రివిజ‌న్ జ‌రిగింది గాని, పెన్ష‌న్ రివైజ్ కాలేదు. అప్ప‌ట్లో బిఎస్ఎన్ఎల్  రిటైర్డ్ ఉద్యోగుల త‌ర‌ఫున‌ వాదించే వారే లేరు. మ‌న‌ల్ని ప‌ట్టించునే నాధుడే లేడు. ఇపుడు చాలా మంది బిఎస్ఎన్ఎల్  రిటైర్డ్ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. మ‌నం సాధించిన విజ‌యాల‌ను సొంతం చేసుకునే వారెంద‌రో ఉన్నారు. వారి దృక్పదంలో పరివర్తన మన వల్లే సాద్యమయింది.  ఈ మార్పే మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం.

ఇంకా మ‌నం సాధించాల్సింది చాలానే ఉంది. ఎన్ని అవ‌రోధాలు, అడ్డంకులు ఎదురైనా వాటిని సాధించాల్సిందే. ఈ ప‌రుగులో మ‌నం సాధించాలి. పోడియంను అధిరోహించాలి. అన్ని స్థాయిల్లోని 

మ‌న సంఘ నాయ‌కులంద‌రినీ ఈ శుభ స‌మ‌యంలో నేను అభినందిస్తున్నాను.

పి.ఎస్. రామ‌న్ కుట్టి